పుట:2015.333901.Kridabhimanamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ. అని మంచన మఱియును బ్రాగ్దికొంచలము వీక్షించి. 61

                          అరుణోదయము

గీ. దాసనపుబువ్వుచయతో ద్రస్తరించు
    చుదయ మయ్యేడు నదె చూ'డు మొదలిసంజ
    సౌబగు వీడిన గట్టెఱ్ఱ సోకెనట్టి
    కామమంజరి నెమ్మోముకాంతివోలె 62

                         సూర్యోదయము
మ. ఆదె మానిక్యపుబూర్ణ కుంభంఊ వయ
                     స్యా : కార్యసంసిద్ధికై
     మెదలం దొచినయట్టి మంచిశకునం
                     బుం గా విచారింపగా
    యుదయం బయ్యెను భానుబింబము దిశా
                    వ్యోమావకాశంబులం
    బదియార్వన్నెపసిండితీగలగతిన్
                     బ్రాకెం బ్రభాజాలముల్ 63

శా. ఓరుంగంటిపురంబుసౌధములపై
              నొప్పారెడిన్ జూచితే
    యీరెండల్ మణిహేమకుంభములతో
               నేకాంతముల్ నేయుచున్