పుట:2015.333901.Kridabhimanamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                             సూర్యోదయము 21

స్వారాజప్రందాఘనస్తనభర
             స్థానంబులం బాసి కా
శ్మీరక్షోదము ప్రాణవల్లభదృఢా
               శ్లేషంబులన్ రాలె నాన్ 64

వ.అనుదితనియమవ్రతంబుగావుననిట క్రితంబ సంధ్యాగ్ని
   హొత్ర క్రియాకలాపంబులు నిర్వర్తింపంబడియె నీవు
  ముఖమజ్జనంబు వేసి యిష్టదేవతాభివందనంబు గావిం
  చితివిగదా గోధూళిలగ్నంబునం బురంబు ప్రవేశింప
  వలయ విశేషించి యుష:కాలంబు సర్వప్రయోజనా
  రంభంబులకు బ్రశస్తంబు 65

గీ. గార్గ్యసిద్దాంతమత ముష:కాలకలన
    శకున మూనుట యది బృహస్పతిమతంబు
    వ్యాసమతము మన:ప్ర్సాదాతిశయము
    విప్రజనవాక్య మరయంగ విష్ణుమత్రము. 66

వ, అని పరిక్రమించి వెలిపాళెంబు కట్టకడపట గటకార
    కుటీరవాటిక బ్రవేశించి 67

                        మేదరవాడ

సీ. ఎకనెక్కముగ నాడు నేదైన నొకమాట
            పాడు నొయ్యన పాట పాటపాట