పుట:2015.333901.Kridabhimanamu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                  ఒక ముచ్చట 18

గీ. ఎట్టకేలకు నలుక రే యెల్ల దీర్చి
    యువిధ యధరామృతము గ్రోలుచున్ననాకు
    బానవిఘ్నంబుగా మ్రోవె బాపజాతి
    జాతిచండాల మైనవేసడపుగోడి. 58

వ. టిట్టిభ : యమ్మదనపట్టాభిషేక మత్తేభరాజగమన నట్ట
    నడుమ సురతకాలంబున వసంతసమయంబునం బాసి
   మల్లికాధవశాట్టహాసమహాకాళమూర్తి యగుతపర్తు
   సమయంబు లంఘించి లాంగలీకుసుమకేసరపరాగ
   రేణువిసరపిశంగితదశదిశాహట్టం బగువర్షాసమయం
   బెట్టకేలకుం గడపితి బ్రావృట్కాలప్రవాసంబును మర
   ణంబును రమణీరమణులకు నొక్కసమంబ యది యెట్టి
   దనిన 59

మ. పటుఝంఝాపవనోత్తృణాలయములో
            బద్రంబునం బట్టెకం
     కటిపై ముచ్చముడింగి నిర్భరవియో
                 గగ్లాని శోషించి యె
    క్కటి నిద్రించుదు నున్న పాంధవనితన్
                 గర్ఝావచ:ప్రౌడిమన్
    ద్టిద్ద్యోతము చూపు నట్టవడురే
              ధారాధరశ్రేణికిన్. 60