పుట:2015.333901.Kridabhimanamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మను నర్ధము కానరాదు. అట్లే ప్రనా (?)ళ మనుపదమునకు గొట్ట మనునర్ధమును గల్పించుకొనవచ్చును. వారనుకొన్న యర్ధముకూడ నందురాకున్నది. ‘రసనాప్రవాళ ‘మను పాఠమే సమంజసమనుకొందును. భీమఖండమున ‘ఘనచక్రవర్తియిచ్చిన ప్రవాళంబుల యొడ్డాణము ధరించు ‘(1-117) అనియున్నది. నాడు ఒడ్డాణములు ప్రవాళములు మున్నగు పూసలతో గూర్చెడివారు. పవడములను, నల్లపూసలను గలిపి గ్రుచ్చుట పరిపాటియే. పగడములు పెద్దవి నల్లపూసలు చిన్నవి. శీఘ్రముగా రెంటిని గలిపి గ్రుచ్చుట క్లిష్టము. గొరగపడుచు ఆపని కావించినదని భావమేమో!

  ఇవియేగాక పూర్వముద్రణములం దన్నిట ఊ నిట్టివే మరికొన్ని ప్రమాదములు దొరలినవి. వానినికూడ నీముద్రణమున శ్రీ శాస్త్రిగారే సరిపరచుకొని యున్న వానిని జతపరచితిని. సూచిక చూడనగును.
                  కాకతమ్మ

శ్రీ శాస్త్రిగారు తొల్దొల్త కాకతమ్మ చిత్రము నిందు ప్రకటించిన తర్వాత పలువు రావిషయమునుగూర్చి విశేషముగా బరిశోధన గావించిరి. డా.శ్రీపాద గోపాలకృష్ణ మూర్తిగా రీ కస్కతమ్మ చిత్రమునకు దిగువనున్న జంతువును సక్కగా నూహీంచి యీ దేవతను చాముండిగా భావించిరి.