పుట:2015.333901.Kridabhimanamu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'విజయలబ్దమదనకాహళము ' (నై ష. 8-1`05). పద్యమున 'ధర్మదారనట్టించుచు 'నని యున్నమీదట 'కుక్కటకంకహళిన్ ' అని యుండుటలో సారస్యములేదు. అయినను తాళపత్రప్రతి పాఠమునె నేనును సంభావించుచున్నాడను. 39 పద్యమున 'టవీప్రదేశమున జెట్టుల చేమల నేమి గల్గునన్ రతి నిటు సంచరించితివి ' అని శ్రీతమ్మయ్యగారు దిద్దివైచిరి. 'జెట్టులుచేమలు నేమిగల్గినన్ బతిచెడి సంచరించెదవు ' అని యున్నతాళపత్రప్రతిపాఠమున కర్ధము కుదురుచునే యుండగ దిద్దనేల? అంతేకాదు 'పతిచెడి ' శ్రీనాధకవి ప్రయుక్తపదము, సంస్కారము తగదు. 13 వ పద్యమున 'పుత్రుడు ' అనికాక శ్రీ శాస్త్రిగారు సంస్కరించినట్లే విభక్తిమర్యాద నపేక్షించి 'సుతునకు ' నని యుండదగును.

    మరియొక పాఠము విషయము.  చూ. పద్యము 144, ఇందు గొరగపడుచు గావించిన విశేషణములు వర్ణింపబడినవి. 'రసనాప్రవాళమున శ్రీఘ్రము గ్రుచ్చెను నల్లపూసవే రనుసమలీల ' అనియున్న పాఠమునకు డా.వేటూరి వేంకటరమణయ్యగారు 'రశనా ప్రణాళమున ' అని సంస్కారమును జూపినారు.*   దానికివారు 'నల్లపూసలలో దారము గ్రుచ్చె ' నన్నట్లేమో చెప్పిరి.  రసనా - రశనా పదములకు మొలనూలు, ఒడ్డాణము నను వర్ణము లున్నవేకాని దార

  • చూ. శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగరి. "హిష్టరీ ఆఫ్ రెడ్డి కింగ్సు"