పుట:2015.333901.Kridabhimanamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'కాకతమ్మయనగా యమునిశక్తియైన చాముండి ' యని చెప్పి 'యామె మృత్యువున కధిదేవత ' యనియు, 'ఏకవీర అనగా రేణుకాదేవి. విష్ణువు అవతారమైన పరశురాముని కన్నతలియగుటచేత ఈమె జగదంబయైనది. పామరజనానికి ఈమె సృష్టికి అధిదేవతగానూ, ఆమె నాశమునకు అధిదేవత గానూ వెలసినారు ' అని జెప్పి 'కాకతమ్మకు సైదోడు ఏకవీర ' అనుటను సమర్ధించుటకు యత్నించినాడు* కాని వారి యభిప్రాయముతో నేకీభవింపక శ్రీ. జి. ఆర్. వ్ర్మగారు భిన్నముగా వ్రాసిరి. వారి యభీప్రాయమున ఆ విగ్రహమున భయంకరత లేమింజేసియు, దీని క్రిందనున్నది నక్కగా దోపమింజేసియు నది ఛామండి కజాలదు. 'కాకతమ్మకు సైదోడు ఏకవీర ' అనుటలో శ్రీ వర్మగారి కది 'ఒకె దేవియొక్క రూపభేదము ' గా తోచినట్లు వ్రాసిరి+ అదిసరికాదు. సైదోడనుటలో వారిరువురును భిన్నులగుట విస్పష్టము. ఇక నిందున్నవిగ్రహము క్రింది జంతువును గూర్చి డా||శ్రీపాదవా రన్నట్లది నక్కకదనుకొందును. అది శ్రీ శాస్త్రిగారు వ్రాసినట్లు వరాహమునే దోపించుచున్నది. గోల్కొండ మ్యూజియము నందలి విగ్రహమున నక్క స్వరూపము విస్పష్టముగానున్నది. దానికిని దీనికిని పోలికలెదు. ఏమైనను బరిశోధకు లింకను జాగ్రత్తతా


  • చూ. బారతి, డెసంబరు 1959: జులై 1960 సంచికిలు.

+చూ. బారతి, జులై 1980 సంచిక.