పుట:2015.333901.Kridabhimanamu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సరము. కావున సంస్కారమునకు దావులేదు. పరిష్కర్తలుద్దృత పాఠము నర్ధము జేసికొనుటకు యత్నించవలెనే గాని తొందరపడి సంస్కరింప బూనుటకు సాహసింపరాదు. ఈ గాధను బోలిన శ్లోక మింకొకటి మృచకటికలో (5-32) కూడ చూడనగును.

  • యది గర్జతి వారిధరో

 గర్జతు తన్నామ నిష్ఠురా: పురుషా:
 అయి విద్యుత్ప్రమదానాం
 త్వమపి చ దు:ఖం న జానాసి.

 విశేషము గాంచుడు  మెఘుడు పురుషుడు, విద్యుత్తు ప్రమద. పురుషులకు స్త్రీల వియోగబాధ తెలియదేమో కాని కనీసము స్త్రీలకైన తెలియునా! అందుకే క్రీడాభిరామపద్యమున మెఱపు మేఘమునకు జెప్పుట!
     (2) క్రీడా. 287 వ వచనమున 'తమ్మడిసాని (కూతుం) గూర్పునేర్పు ' అని శ్రీతమ్మయ్యగారు గ్రంధమున లేని 'కూతు ' శబ్దమును గూర్చిరి.  ఈ సంస్కార మనవసరము.  వచనము 272, 288, 291 - పద్యము 289 తిన్నగా బరికింప దగును. 'తమడిసానిమందిరమున ' విడిసిరి. అక్కడ 'పూజరివిధవచేత ' కబురంపిరి.  'పూజరి వారియింట ముంగిట నిలిచి ' టిట్టిభునకు 'తమ్ముడిసానిం గూర్పు నేర్పు విచారించి-

  • చూ. సాహిత్యాచార్య భట్టశ్రీ మధురానాధశాస్త్రి పరిష్కరించి ప్రకటించిన గాధాసప్తశతి పుట 7 (నిర్ణయసాగర్ ప్రెస్సు 1933)