పుట:2015.333901.Kridabhimanamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

టకై 'తటిద్ద్యోతత చూపు నట్ట నడురే ధారాధరాశ్రేణికల్ ' అని సంస్కరింపవలయు నని యుబలాటపడిరి. వ్యర్ధప్రయాస 'మేఘములయొక్క విద్యుత్ప్రకాశము (బయటి వారికి) గన్పడజేయును ' అని యనుకొనిరి. అక్కడే అన్యయము వంకరదరి పట్టినది. అది చూపునది వారనుకొన్నట్లు బయటివారికికాదు. మేఘములకె బోలెడు సరస్యమున్నది. క్రీడాభిరామమునందే పైపద్యమునకు ముందున్న వచనమున దాని నర్ధముచేసికొనుటకు జాలినంతవివరణ మున్నది. తిలకింప దగును. గధార్ధ మిది: ప్రియుడు దేశాంతరగతుడగుటచే ప్రియురాలు నిర్భరవియోగగ్లాని ననుభవించుచున్నది. దానికి వర్షాకాలము మఱింత బాధాకరమైనది. గాలికొట్టి యింటిక ప్పెగిరిపోయినది. లోన మంచముపైవియోగమున ముచ్చముడింగియున్న వనిత మెఱుపు కాంతిలో కాననైనది. మెఱుపుకన్నె జలధరముల కామెను చూపి వాని రాక కారణమున నామె కెంతతి, దుస్థితి ప్రాప్రించినదో వివరించినది. అంతేకాని చూపినది యబటి వారికి కాదు. ఇక గర్జావచ:ప్రౌఢిమను గూర్చి-గర్జ వాస్తవమునకు మెఱపుదే. మెఱపువచ్చిన తర్వాతనే మేఘమున గర్జ వినవచ్చును. మెఱపులేని మేఘమున గర్జ లెక్కడివి? కావున విద్యుత్కాంత తనదేయైన గర్జావచ: ప్రౌడిమతో మేఘమాలకు చూపినది. ఇంతకు మించిన వివరణ మనన