పుట:2015.333901.Kridabhimanamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చున్నవి" అని వ్రాసి శ్రీ శాస్త్రిగారి పాఠములనే చాలవఱకు గ్రహించియు, గొన్నిటమాత్రము బేదించిరి. తమకే సందేహాస్పదములుగా నున్నవానిని సంస్కరింప సాహసింపక అట్లే విడిచితిమని వ్ర్రాయుచు పీఠికలో మాత్ర మాయా పాఠముల విషయమున గొన్ని సూచన లిచ్చిరి. అట్లు వ్రాసి, వారును భ్రమప్రమదముల నధిగమించినవారు కాజాలక పోయిరనియే నా విచారము. చిత్తగింపుడు.

     (1) ఇందలి "నతుఝుంఝూపవనోత్తృణాలయములో" (60వ) పద్యమును చూడుడు.  దానికి మూలమగు గాధను శ్రీ శాస్త్రిగారే తొల్త గాధాస్జప్తశతినుండి గుర్తించి చూసినారు.  ఈ యనువాదము మూలమున కెంత సన్నిహితముగా నున్నదో వివరించుచు లఘవివరణమును గూడ తమపీఠికలో నిచ్చిరి (చూ.పీఠిక 42 పు) శ్రీతమ్మయ్య గారు వివరణమె విశదముగా లేదనిరి. వారి కిక పద్యమున కర్ధ మెట్లు కుదురును? "జలధరాణాం అనుటకు 'ధారాధరశ్రేణికిన్ ' అని కిషష్ఠితోడి యనువాదము మూలానుగుణమగునా?" అని విమర్శించిరి.  ఏల కాదో? భావమేకాక విభక్తిప్రత్యయమును మూలాను గుణముగనే యున్నదే! ఇంకను 'గర్జావచ: ప్రౌఢిమతో మెఱపుకాంతు లాకాంతను జలధరపంక్తులకు జూపుట యేమి? ఇందేమైన సారస్యమున్నదా? అని ప్రశ్నించుకొని 'కవిపాశమును ' గుర్తించు