పుట:2015.333901.Kridabhimanamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సన్నపు టెలుంగునం బూజరిసానిం బిలిచి 'కనకనిష్కంబుతోడ గూడ కర్పూర వీడియం బచ్చేడియ (తమ్మడిసాని) చేతిలోనంబెట్టి యాపాదమస్తకంబు వీక్షించి ' - వర్ణించిరి. ఆ వర్ణనము తమ్మడిసానిదే కాని యన్యులది కాదు. పూజరిసని బిలిచి - 'కూడింపుకూతు ' నన్నారు. 'పూజరిసానిబిడ్దను వెడ్డువెట్టి ' టిట్టిభుని చేతికిచ్చి ఇత్యాది. పూజరిసానియే తల్లి. తమ్మడిసానియే పూజరొసానికూతురు. విమర్శకులు 'కూతు ' అని చేర్చి చెప్పినఫ్ఫు డేట్టియన్వయము చెప్పుదురో యట్లే ఆ పదము లేకున్నను నన్వయము పొసగరు. అంతేకాదు పూజరిసానియు, తమ్మడిసానియు దల్లి బిడ్డ లనదగినట్లే యిందున్నది. కావున వారి సంస్కార మనవసరము. ఉన్నపాఠము తిన్నగానే యున్నది.

       (3) 'కీసిన ' వెదురు సలాకల ' (క్రీడా. 70 వ). 'కీసిన ' యను పదము నిఘంటువుల నెక్కలేదు. దీనిని 'గీసిన  అని  శ్రీతమ్మయ్యగారు మార్చిరి. అవసరములేదు.  చీరుట అను నర్ధమునగల కీయుధాతువు పరుషాదియేకాని సరళాదికదు. నవనాధచరిత్ర చూడదగును. 'ఒసవుగా ముసుగిడ యోరగొంగడియు గీసిన గుదియయు ' *ప్రాచీనకవి ప్రయుక్త పదములను తామెఱిగిన విధమున సంస్కరించుట కదు పరిష్కర్తలు చేయవలసిన పని.  వానిని శక్యముగురీతిని గుర్తించి కాపాడవలెను.

  • చూ. శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి "సాహిత్య సమీక్ష" పుట.238