పుట:2015.333901.Kridabhimanamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

‘పలనాటివీరపురుష పరమదైవతశివలింగభవనవాటి ‘ కడ ‘చిత్రంపు పలకగద్దెపై—శీలబ్రహ్మాది వీరనాసీరచరిత ‘ ను చిత్రించి యాపల్నాటివీరుల గాధను వీరపురుషులు గానముచేసి యభినయించిన వివరములున్నట్లు భావింపవచ్చును. ప్రేమాభిరామరచనాకాలమునకు వారు పాడిన గేయములు శ్రీనాధునివి కాజాలవు. ఈ వీధినాటక ప్రబంధ రచన కించుక పూర్వమే శ్రీనాధుడా గేయాత్మకగాధను ద్విపదప్రబంధముగా నావిష్కరించి యుండెను. అది దేశమున శీఘ్రకాలముననే ప్రచారము నొందెను. నాటినుండి శ్రీనాధుని ద్విపదలకే పలుకుబడిసాగినది. అందుకే యీవీధీనాటకప్రబంధమున నావిషయమును వ్రాయునపుడు ‘యతిగూడంద్విపదప్రబందమున వీరానీకముంబాడే ‘(116 వ)నని శ్రీనాధుడు విశేషించి వ్రాసికొన్నాడు. అట్లే వల్లభరాయ డభిమానముతో వ్రాసి యాడించి, యానంచిన రూపకమును గూడ నతడు వస్తువునందలి గౌరవముచేతను, రావిపాటి త్రిపురాంతకుని రచనపైగల ప్రీతిచేతను, విభవ మొసగిన వల్లభరాయని ప్రేరణముచేతను గ్రహించి ప్రబందీకరించినాడనవచ్చును. తన కర్తృత్వము శ్రీనాధుడిందుప్రత్యక్షముగ నుచ్చరించుకొనకపోయినను నావిషయమును సహృదయు లరయునట్లు తనకవితామూర్తి నంతకెక్కుడుగనేప్రతిపదమున ముద్రించుకొని యున్నాడు. పల్నాటి