పుట:2015.333901.Kridabhimanamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాగ్దోరణిని శ్రీనాఢుడు ప్రశంసించి యుండును. అందుకే యీ నాటకప్రబంధమున నున్న కృత్యాదిపద్యము అంత యుత్కర్షతోనున్నది. *శ్రీనాధుడు కవిసార్వభౌముడగుట జేసి 'కవీంద్రకాంక్షిత త్రిదశంహీరుహంబగు తిప్పయ వల్లభరాయమంత్రి ' కవియసోలోభమున విభవమొనగి కోరగా నతడుద్యమించి అనుసరించి యుండును. 'వల్లభరాయ ప్రణీతం ' అని ప్రకటించియుండును.

ప్రశస్తరచనములు కాదగినవానికి సాహితసిద్ధి గల్పించుటకై శ్రీనాధు డిట్టి కార్యము లొండు రెండు ప్రత్యక్షముగ పూర్వమే కావించినాడు. దేశమున ప్రజల నాలుకలపై భ్రష్ఠవాక్యములతో శుద్ధి లేకయే ప్ర్రచారమున నుండిన గేయాత్మక గాధలను కాటమరాజుకధ, పల్నాటివీరచరిత్ర మున్నగువాని నీతడు శుద్దమగు ద్విపదప్రబంధములుగా స్ంతరించి యుండెను. వానినే తరువాత ప్రజలనుసరించి పాడి, యాడి తన్మయులు కాసాగిరి. ఈ క్రీడాభిరామ వీధీనాటకప్రబంధమందేయిట్లనుట కాధారమున్నది. రావిపాటి తిప్పన్నరచనలలోనే నాడు ఓరుగల్లునగరమున


  • కృత్యాది పద్యములున్న యీ పట్టు వల్లభరాయని రచనము కాజాలదు. ఇవి యన్నియు సూత్రధారోత్తులును గావు. రూపకమున బ్రస్తావనలో మాత్రధారోక్తులుగా నుండిన రచనా భాగము బహుశ: 1.31. 82. 33 పద్యములును నటుపై బాగమునందును నున్న భవములయి యుండవచ్చును.