పుట:2015.333901.Kridabhimanamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మిట్లున్నది. నేడు మన కులభ్యమగుచున్న క్రీడాభిరామమనబడు వీధినాటకప్రబంధము రచనాసందర్భమును బట్టి శ్రీనాధరచనమని నొక్కి చెప్పుట కెట్టి సందియము నక్కరలేదు. లాక్షణికుల యుక్తికూడ నట్లేయున్నది. కాక గ్రంధమందలి ప్రతిపదము నా విషయమున్ చాటుచునే యున్నదని శ్రీ ప్రభాకరశాస్త్రిగారు విపులముగా నాయావిషయములనెల్ల తమ పీఠికలో విశదపరచియే యున్నారు. ఇట్లీ గ్రంధమందలి పద్యరచనలో బ్రతిపదము శ్రీనాధుని బట్టి యిచ్చుచుండగా నిందే వల్లభరాయనికి కూడ నించుకంత క్ర్తృత్వ గౌరవమాపాదింప ప్రయతింపవలసిన యగత్యము లేదు. నా యభిప్రాయమున గూడ ప్రతిపదము రసబంధురమగు నీ ప్రబంధమందలి రతన మంతౌ శ్రీనాధునిచే గాని వల్లభరాయనిది కాదు.

 అయినను వల్లభరాయని క్రీడాభిరామముతో గల సంబంధ మెట్టిదో పైన సూచించిన విధమున సహృదయుల కిదే నివేదించుచున్నాను.
     సంస్కృతమున ప్రేమాభిరామమును త్రిపురాంతక వాసి యగు రావిపాటి త్రిపురాంతకుడు వీధీనాటకముగా రచించినాడు.  రసవత్తరమగు నా దృశ్యప్రబంధమును జదివి వినుకొండ వల్లభరాయడు దానియం దాకృష్ణుడైనాడు.  అందుకే "ఆ మంత్రిశేఖరుండు రావిపాటి త్రిపురాంతక దేవుం