పుట:2015.333901.Kridabhimanamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధము తెగియుండదు. ఇట్లు వినుకొండవారుగా బ్రఖ్యాతిగాంచిన కుటుంబములోని వాడగు వల్లభరాయని శ్రీనాధుడాదినములలో వినుకొందలో గాని, మోపూరులోగాని దర్శించి యుండును. అప్పుడే మోపూరుకై భై రవస్వామికి జరుగు తిరునాళ్లసందర్బమున ప్రదర్శన కనుకూలముగ వల్లభరాయనిచేత నిర్వహింపబడిన యీ రూపకము శ్రీనాధునిడెందమున కెక్కియుండును వల్లభరాయని ప్రేరణమున క్రీడాభిరామముగా జాలువారి యుందును. విషయమును ముందు వివరింతును. ఈ గ్రంధమందలి రచనా సందర్శమును బట్టి యిది శ్రీనాధుని భీమఖండరచన మునకు దర్వాతను, కాశీఖండ రచనకించుక పూర్వమో లేక తరువాతనో రచియింపబడి యుందునని భావింపవచ్చును.*

                        కర్తృత్వము
   క్రీడాభిరామకర్తృత్వమును గూర్చి చర్చలు, తర్జన భర్జనలు నేటిదనుక చాల జరిగినవి.  నా యభిప్రాయ

(*చూ. కాశీఖండము 7-230 పద్యమున నీ క్రీడాభిరామమును స్మరింపజేయు వివరము లున్నవి.

"గౌరగయై మైలారు గొనియాడు నొకవేళ
         నొడలిపై బడారుపసుపు బూసి
  ప్రయితించి నొక్క(!) వీరాదేవి నొకవేళ
       బవనీ డయి సమగ్రభక్తి గరిమ".

(ఇందు 'నొక్క ' యని కాక 'నేత ' యని యుండునేమో!)