పుట:2015.333901.Kridabhimanamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డనుకవీశ్వరుం డొనరించిన ప్రేమాణ్భిరామనాటకంబు ననుసరించి క్రీడాభిరామం బనురూపకంబును తెనుంగుబాస రచియించినాడు" -అనినాడు శ్రీనాధుడు. కాని యెవరేని వల్లభరాయని యనుకరణమును దపుబట్టుదురేమో యని కవీశ్వరుడే యిట్లు సమర్ధించుచున్నాడు.

"అత డెంతటివాడు ప్రేమాభిరామ
  మనగ వెంతటియది దాని ననుసరించి
  వీధిఅను రూపకము మది వెఱపులేక
  తిప్పవిభు వల్లభుండెట్లు తెనుగు జేసె.
వ. అని యానతిచ్చెదరేని.
ఉ. నన్నయభట్ట తిక్కకవి
       నాయకులన్న హుళక్కిభాస్కరు
  డన్నను జిమ్మపూడి
     యమరాధిపుఉడన్ననుఇ సత్కవీశ్వరుల్
  నెన్నుదుటం గరాంజలులు
      నింతురు జేయని రావిపాటి తి
  ప్పన్నయ నంతవాడ
     తగునా యిటు దోసపుమాట లాడగన్.
గీ. జనని సంస్కృతంబు సకల భాషలకును
    దేశభాషలందు దెనుగు లెస్స
    జగతి దల్లికంటె సౌభాగ్యసంపద
    మెచ్చుటాడుబిడ్డ మేలుగాదె---"