పుట:2015.333901.Kridabhimanamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనికాక "వల్లభ" అని యుండదగునని శ్రీ శస్త్రిగరి సంస్కారము.

    2.ఇందలి రచనా సంప్రదాయ మెట్లుండగా నెట్లో విమర్శకులు చెప్పిన చొప్పున పై (22) పద్యమున కన్వయము గల్పించు కొందమన్నను జిక్కులు తప్పకున్నవి.  'బైచన మల్లన తిప్పమంత్రు ' లలో నెవడు 'మూడు గ్రామ గ్రాసములతోడ గూడంగ ' మోపూరు బాలించెవో ఆ త్రిపురాంతకాధీశ్వరునకు 'ప్రియతనూజుండు చందమాంబికకు సుతుడు ' 'వల్లభామాత్యవరుడు మనుజమత్రుండె ' అని ప్రధమనుండి షష్ఠికి విశేషణవిశేష్యములను కప్పదాటుగా నన్వయించుకొనవలసివచ్చును.  ప్రాముఖ్యమునుబట్టి యీ యర్ధమున బద్యమెల్ల రెండుముక్క లగుచున్నది.  అది యీ సీసపద్యరచనాసౌభాగ్యమును గుంటుపడజేయుచున్నది.
 అంతేకాదు.  వాదసరళికి ఈ త్రిపరాంతకుడు లింగన సోదరుడగు తిప్పనకాక యాతిప్పనకు కుమారు డగు తిప్పనయే యనుకొన్నను చిక్కున్నది.  'త్రిఉరాంతకాధీశ్వరునకు బ్రియ తనూజుండు చందమాంబికకు సుతుడు- వల్లభామత్యవరుడు ' అని మాత్రమేపద్యమున నుండుటను బట్టి కృతికర్త యనిపించుకొన్నవానితల్లిగారి కులగోత్రములెమియు జెప్పబడలే దనవలసివచ్చును.  వల్లభుని వాయ