పుట:2015.333901.Kridabhimanamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నమ్మయొక్కయు, తాతగారి భార్యయొక్కయు కులగోత్రాదికప్రశంసను విపులముగా గావించిన కవీశ్వరుడు తల్లినిగూర్చి సగౌరవముగా జెప్పవలదా? లేదేమి? రచనా సందర్భమునుబట్టి యట్టి పధ్యము లీ గ్రంధమున శిధిలములై యుండునునన వలనుపడదు. వంశ మూలపురుషు లగు చంద్రామాత్యునిభార్యను గూర్చియు, మంచనభార్యను గూర్చియు వ్రాయునపుడు చెప్పినట్లె యిచ్చటను జెప్పినా డనగుదురదు. అయిన వంశమున నడిమెవరిభార్యలకేనా కులగోత్రము లుందుట ! కావున పైవిమర్శక్జుల యభిప్రాయముతో నే నేకీభవింపజాలకున్నాను. మిక్కిలి పూర్వులగుటచే చంద్రామాత్యుని, తత్తనయునిభార్యలప్రశంస నధిక ముగా (తెలియకేమో!) జేయలేదు.

   అటుపై క్రమముగా జేసినాడు.  మంచనార్యుని కుమారుడగుమల్లనచివాగ్రణి 'మిరుతూరి నిట్టమంత్రీశ్వరుతనయను ' వరించెను.  ఆ మల్లామాత్యు పుత్రుం డగుతిప్పమంత్రి యధిక వైభవమున 'హరితగోత్ర జలధిహరిణాంకుడగు తిప్పనార్యతనయ ' ను బరిణయమాడెను.  కాని యామె పేరు గ్రంధమున ముద్రితమైనట్లు 'పెద్దమాంబ ' కాదు 'చందమాంబ ' యని యుండనగునని నేనూహించుచున్నాను.  పాఠము "తిప్పనర్యతనయ జందమాంబ నెలమి" అని యుండవచ్చును. 'మంచనశర్మ ', 'మంచెనశర్మ ' అని యీ