పుట:2015.333901.Kridabhimanamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“గుండియ దేడుచున్ = గుండియయందు శయనించుచు” ఇతరులను బెదరించునప్పుడు ‘నీగుండెలో నిద్రపోవుదును ‘ అనుట వ్యవహారమున గలదు. దానినే యీకవి యిటగ్రహించినాడు. మఱియు ‘తేడు ‘ ధాతువు సమానార్ధక మగు ‘తెండు ‘ ధాతువునకు గూడ ‘శయనించూ అనునర్ధమే సప్రమాణముగా గాన్పించుచున్నది. పై విషయము లన్నియు బరిశీలించి చూడగా గ్రీడాభిరామప్రయోగంలో శ్రీ శాస్త్రిగారు వ్రాసిన యర్ధము సమంజసముగా లేదని తోపకపోదు.”

ఇందుకు నా సమాధానము!
ఇందు .’తేడు ‘ ‘శయనించు ‘ అనునర్ధము గలదనిటకు
శ్రీ శాస్త్రులుగారు ప్రయీగముల జూపిరి. ‘తేడు ‘ కు ‘వెదకు ‘ అనునర్ధముకూడ గలదనిటయే నాయాశయము గాని ‘శయనించు ‘ అనునర్ధము లేదనుట గాదు.’వెదకు ‘ అర్దమున ‘ ‘తేండుదల్, తేడుదల్, తేడితేడి ‘ ఇత్యాదులు తమిళమిన సర్వసామాన్యముగా వాడుకలో నుండును. ‘తెండు తేడులు ‘రూపాంతరములగుట శ్రీ శాస్త్రులు గారు నంగీకంచిన విషయమేగదా, తెలుగునగూడ “నాడు తెండుకు తెండుకు అవస్తపడుచున్నాడు నేనన్న మాటకు“ ఇత్యాదివ్యవహారము నాజన్మదేశ మగుకృష్ణామండలమున నున్నది. ‘తెండ్క ‘కు తిరుగదోడు,కలబెట్టు,పెనగులాడు, వెదకు, తదేకవిచారముతో నుండు ‘ ఇత్యాది విధముల నర్ధము సంగతమయియున్నది.