పుట:2015.333901.Kridabhimanamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇట "తేడు=వెదకు" అని (పీఠిక-121 పొ.) శ్రీశాస్త్రి గారర్ధం వ్రాసినారు. కాని తేడుధాతువున కీయర్ధమును, తన్నిర్ణాయకప్రయోగములును గాన్పింపవు. ఇదియే గాక యీ పర్యమునగూడ వీరు వ్రాసినయర్ధ మేమాత్రమున్ సందర్భోచితముగాలేదు. శబ్ధరత్నాకరములో నీపదమునకు 'తెండు, శయనించు ' అనునర్ధం వ్రాసి,

'అతివ పూర్ణేందుభీతి దదశ్మశాల
 దేడి యత డందు వినుమడి తీండ్ర దోప
మింటిపై మంట కాదని యింటిపైకి
దెచ్చుకొంటి నటంచు బెన్ ఱిచ్ఫ వెడలు, '( ఆముక్త.5-146)

ఉదాహరణముగా నీయబడినది. ఈ యర్ధమే క్రీడాభిరామప్రయోగమునగూడ నెంతయు సమంజసముగా నున్నది. ఈ బ్రాహ్మణుడు పూటకూటింట భుజించి తాంబూలము వేసికొనుచు నెక్కడకో శయనిపబోవుచున్నాడని యిట భావము, మఱియు,

అనలుని గాడుచుం జముని
    నాడుచు రాక్షసు బాడుచుం గప
ర్దినొసలు చూడుచుం దనుజు
    ప్రేవులు దోడుచు గాడ్పు కడ్పులో
గునుకులు గోడుచున్ వరుణు
    గుండియ దేడుచు హాహనేంద్రు నం
దిని జన వేడుచున్ నృపతి
    నేర్పులు దీడుచు వెండి వాడిగన్ (కకుత్ స్థ.5-123)