పుట:2015.333901.Kridabhimanamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆముక్తమాల్యదా కకుత్ స్థవిజయ ప్రయోగములు నే జెప్పిన యర్ధమునకు గూడ బొసగుననియే-- "చంద్రకాంత శిలాశాలలో దాపము గొల్పనిపట్టువెదకి"- అనియు, "వరుణుని గుండెల వెదకుచు (గలబెట్టుసు)--" అనియు మీదిపద్యములలో నేజెప్పిన యర్ధము సరిఫోవుచునే యున్నది. మ~ఱియు నాముక్తమాల్యదాపద్యమున ప్రాచీనప్రతులలో గొన్నింట--

   అతివ పూర్ణేందుభీతి దదశ్మశాల
   ద్రేణి యత డందు నినుమడి తీండ్ర దోప-

   అని కలదు-- ఓరియంటల్ లైబ్రరి చూ. 10-2-1 వ్రాతప్రతి. దీనికి శ్రీనివాసీయవ్యాఖ్యలో 'యువతి పూర్ణ ఛంద్రునిమీద భయపడి చంద్రకాంతశాలలో ప్రవేశించి, ఆచంద్రకాంతశాలయందు చంద్రుడు మిక్కిలి వేండ్రముగా కానవచ్చేటప్పటికి" అని కలదు.  సి.పి.బ్రౌనుదొరగారు కూడ దమనిఘంటువున నీపట్టున ప్రయోగమును "త్రేణి" యనియే గ్రహించిరి.  ఐ.సీతారామాచార్యులవా రేలోకో బ్రౌనుదొరగారిపఠమును గ్రహించినవారుగారు.  మఱియు బ్రౌనుదొరగారు 'శ్రేణి ' కి ఆముక్తమాల్యద నుండియె ప్రయోగాంతరమునుగూడ జూపిరి.  అది యితి. 

క. హత్తుకొని యొక్క కొందఱు
   నత్తెరువుం గట్ట బనిచి యందఱక్రియ దా