పుట:2015.333901.Kridabhimanamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీనాధుడు పలుచోట్లప్రయోగించెను. 'చిఱుబంతిపసుపుపోడి" యనియు (భీమ 2-28) గల యీతని ప్రయోగాంతరమును బట్టి యీ పదమునకు స్నానసమయమున బూసికొనేడు 'పసుపుపూత ' యర్ధమగు ననుకొందును. సివమెత్తినవారికి స్నానానంతరము గూడ నాపసుపును మొగమున బూయుదురు. కాన యిక్కడ నా యర్ధము సరిపడును. 'చిఱుతచౌకంబుల తొగరుబుట్టము '. పాండురంగసుకవి దీనిని గైకొన్నాడు. "కట్టిరి చిఱుతచౌకముల క్రొంబుట్టముల్" దీనికి సరిగా నర్ధము తోపలేదు. పు 45. ఎడపదడప=అప్పుడప్పుడు, ఈపలుకుబడిని శ్రీనాధుడు కాశీఖండమున గూడ బ్రయోగించెను. 'ఎదపదడప తనూభవుం డెచట నుండు గానరాడని గృహభర్త కాంతనడుగ ' (4-=85). జీవగఱ్ఱ= వీణతంతులకు కంబళిపీచు చుట్టి యాన్చి యుంచెడు పీటవంటి కొయ్య, లేక శ్రుతిని హెచ్చుతగ్గులు చేయుటకు దీగలను జుట్టి తిదిపట్టున గ్రుచ్చియుంచిన చెవివంటి బిరడా పు 46. ఉరుమ=వాద్యభేదము, పిల్లదురులు=ధ్వనివిశేషము, పు 47. చండ్రమల్లెలు=చండ్రనిప్పులు. కరవాడి=చేసానపట్టినది. హొన్నశము=బంగరుపిడిగలది? పు 48. నెట్టికసీల=అడ్డిగసీల, కంఠాభరణము=మరసీల "అడ్డిగనీలంత ఉన్నదో లేదో ఎంతమా టన్నదో చూడు ఆ పిల్ల" ఇత్యాది వ్యవహారము కృష్ణామండలమున నేడును గలదు. ఈపదము ఆముక్త