పుట:2015.333901.Kridabhimanamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాల్యూద, ప్రభావతీప్రద్యుమ్నము మొదలగు గ్రంధములందును బ్రయుక్తమయ్యెను.శబ్దరత్నాకరకారులు ఆముక్తమాల్యదలోని "నెట్టన యల్ల లచ్చి యల నీలయ భూపతి యుండ నీకు నీనెట్టికసీలపై మనసు నిల్చుట కే మనవచ్చు" (6-111) పద్యం నుదాహరించి యీపదమును 'నైష్ఠికశీల ' పదపువికృతిగా భావించి సదాచారపరతంత్ర యని యర్ధం వ్రాసిరి. కాని యాప్రయోగమునకు గూడ 'చిట్టిబొట్టెకాయ ' యనియే యర్ధము యుక్తం. "అరయ నెట్తికనీల లంత లయ్యును లింకమున బ్రహ్మశిఖ ముట్టుప్రోడలార!" అని ప్రభావతీప్రద్యుమ్నప్రయోగము. పు 52. 'రెండెనిముదుల్ ' 'ఎనిమిదుల్ ' అనియో 'ఎనిముదుల్ 'అనియో కవిప్రయోగము. 'రెండుతొమ్మిదులు ' అని కాశీ ఖండప్రయోగము గలదు. ఇక్కడగూడ 'రెండేనిదుల్ ' కావచ్చును. అట్లేల్ని చిన్నయసూరిగారి మాత్రమునకు వార్తికము చేర్చవలసివచ్చును. పు 53. త్రేడు=వెదుకు. బాడు-బ్రాహ్మణుడు. దీనినిగూర్చి నేనుప్రకటించిన లక్ష్మీ పురశాసనమున గొంత పరిశీలనముగలదు* (విభవ, జ్యేష్ఠ, భారతి.) తాలబోయు= తాలింపుచెట్టు. కుఱుబోడ=? బఱివోవు= హద్దుమీఱు పు 61. మయ్యెరన్ = వెండ్రుకతో? ఇది శ్మశ్రుశభ్దవికృతిగావచ్చును. అడియాలము-గుర్తు అడి=


  • చూ. అనుబంధము.