పుట:2015.333901.Kridabhimanamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కూడ నర్ధమేమోయని సందేహముతోచును. కానియట్లుగాదనుకొందును. పూటాకూళ్ల యిళ్ల వాడకు దగ్గఱగా వేశవాటిగాని, వేశ్యలయిండ్లుగాని యుండుట నేడును గలదు. అట్లే పూటకూళ్లమ్మలవాడలో వసించువేశ్వలని పైపద్యచరణమున కర్ణము గావచ్చును. లేక 'మేదరకరణవేశ్య, కర్ణాటవేశ్య ' యని యింతకుబూర్వము ప్రయోగించినట్టుగా నీకవి పూటకూళ్ళమ్మవాడలో వ్యభిచారవృత్తితో నుండుపూటకూళ్ళపొలతులయిన బేర్కొని యుండవచ్చును. పు 40 త్రిక్కటి=త్రికాష్ఠి, తిగటము, ముక్కోణము ? పు 41 గవడపేరు=పెద్దహారము? గొప్పరుద్రాక్షలకు గవడకాయలని గవడ రుద్రాక్షలమాల యని, గొప్పరుద్రాక్షలకు గవడకాయలని నేడు వ్యవహారమున్నది. 'గవుడ ' యని శ-ర. 'కానకకన్న ' ఈ పలుకుబడి శ్రీనాధోపజ్ఞ మేయేమో? పు 42 కేయూర బాహుచరిత్రమున మంచెన "చారుతరమూర్తి మండూక చక్రవర్తి" యనగా శ్రీనాధు డిందు "చారుతరకీర్తి, బవనీల చక్రవర్తి" అనెను ఇట్టి సంవిధానము ననేకు లనుకరించిరి. "సకలగృహవర్తి మూషకచక్రవర్తి" "సకలగృహవర్తి మార్జాలచక్రవర్తి" ఇత్యాదివిధముల బ్రాచీనులే కాక శ్రీ జార్జిచక్రవర్తి పట్టాభిషేకపద్యరచయితలలో నొకరు "సకలగృహవర్తి మాజార్జిచక్రవర్తి" యని కూడ దీని ననుకరించిరి. పు 44 ఓలగంధము=ఈ పదమును