పుట:2015.333901.Kridabhimanamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏదో నొక పక్షము గెల్చిననో, ఉభయపక్షములకు విశ్రాంతి వలసిననో దీని నూదుదురు.

"విఱిగి పాఱదొడంగె వీరపనేడు
  జయలక్ష్మి సేకొని స్వామివా రపుడు
  దయ మీఱగా ధర్మదారవట్టించి
  బంగారుబొమ్మను బాండ్యభూనాధు
  డింగితవేదియై యిచ్చిన మెచ్చి
  తంజాపురము సేరి." (రఘునాధాభ్యుదము-12.పొ)
  "మేటిడునేదార్ల మెఱయునజీర్ల
  ఘోటకమత్తేభకోటుల జదిమి
  హేల బైపై జొచ్చి యెల్ల శాత్ర;ఉల
  ద్రోతి పెన్గొండకు ద్రోవల నూకి
  ... అని వేడుకొనిన దయాదృష్టి జూపి
  తనరువేడ్కల ధర్మదారవట్టించి
  సమరంబు పాలించి చయ్యన మరలి"
                       (సౌగంధికాపహరణము కృత్యవతరణిక)

   ఆముక్త్గమాల్యదలో గూడ నీపదము గలదు.  చూ.5 ఆశ్వారము 150 పద్యము. కాని యం దీపదము నీయర్ధము ననే కవి ప్రయోగించెనని చెప్పకశక్యముగానున్నది.  ఆపద్యము నర్ధమును బాఠమును స్పష్టముగాలేవు. ధార, దార పదములు వాద్యవాచకములుగా శాసనములందును గ్రంధములందును ప్రయోగింపబడినవి.,  చేబ్రోలి శాసనము, బసవపురాణము చూడదగును.