పుట:2015.333901.Kridabhimanamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"బేరిడమామీలు పిల్లగ్రోవులును
  దారలు గిడగిళ్ళు తమ్మటధ్వనులు
  నపిరీలు రుంజలు నడవాద్యములును
  విపరీతముగ మ్రోసె వినువీధి నిండ (పల్నాటివీరచరిత్ర)

  పు 20. సొబగువీడు=ఋతువగు. పు 22. పచరించు=ప్రకటించు, వెల్లడినేయు, దిన్సువాఱు=దిస్సు (స్మితధ్వన్యనుకరణము) మను.  తీగనవ్వు=సాగిననవ్వు. ఈ సీసపద్యమును రాధామాధవకవి యనుకరించెను.

సీ.కన్ను లార్చుచు గొన్నిసన్నలు గావించు
        రీగనవ్వులు నవ్వు దిస్సువాఱు
  బయ్యెద దిగజార్చి పాలిండ్లు పచరించు
        నఱితి వేరులు చక్క నలవరించు
  గాజులచప్పుళ్ళు గలుగల్లు మనజేయు
        గొనగోళ్ళ నందంద కురులుదీటు
  నీలరాగము నెలయించు వించుక జాడ
       దగపుమాటల జాణతనము లాడు
                (రాధామాధవము. 5.112)

పు.23. వల్లువము=రొక్కౌజాలె. పు24. పటితాళించు=బెళుకులార్చు. మైలవంక=ఊరివెలుపల నుండునిన్ను జాతులసంత. సుసరభేత్తు=సులువుగా రోమములు తొలగ జేయునది. పు 215. పజ్జికపుజాయ=కనుగంధనిపన్నె? ఈ