పుట:2015.333901.Kridabhimanamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీ. జనని సంసృతంబు సకలభాషలకును
    దేశభాషలందు దెలుగు లెస్స (క్రీడా. 27 వ)
         శ్రీకృష్ణరాయలవా రాముక్తమాల్యదలో దీనినే
   "ఎల్లనృపులు గొలువ నెఱుగవే బాపాడి
     దేశభాషలందు దెలుగు లెస్స". (1-15)

   ఆనియుదాహరించుకొనిరి. పుట 14 గొజ్జంగిపూనీరు= పన్నీరు. జలపోసనము= మొలాము, నీరూదుట. జఱిగొన్న= సరిగచుట్టిన, జరిగొన్న, సరిగొన్న, చరిగొన్న, జఱిగొన్న రూపములలో నేదిసరియో అర్ధ మింకేమో అస్పష్టము చూ. శ.ర. చరికుండ. 'జఱివోని (గోని?)గడితంపు జిఱుతచౌకంబుల తొగరుబుట్టము ' 44 పుటలో ప్రయోగాంతరము  శివరాత్రి మహాత్మ్యాదులలో గూడ నిది గలదు.  పుట 15, అక్కిలజేయు = ముడుచుకొనజేయు. ఇరుచంబడు = కురియబడు, గుమ్మడిమూట= గుమ్మడిపండునాకృతిని గట్టినమూట. సుగ్గడి తము= సుఘట్టితము (వస్త్రము). తోపురెంటము = తోపువనె గలజమిలినూలి దుప్పటి. తట్టు పున్గు=నిద్దమైనపునుగు. పుట 17. కోబడు = గుడ్లగూబ.  మాగిలిమాగిలి = అచియూచి. పూగొమ్ము= పూగొమ్మ. వలతీరు=కుడివైపుగతి. పుట 18. ధర్మదార= యుద్దాంతజ్ఞాపకముగా నూదుబాకా. దీని నూదినపిదప నిక యుద్ధము సేయరాదు.  రెండుపక్షములును వైరమునువీడిధర్మముగా వర్తిల్లవలెను.  సంధిజరగిననో,