పుట:2015.333901.Kridabhimanamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెలిపాళెము బ్రవేశించిరి. వెలిపాళె మనగా నగరప్రాకారమనకును బరిఖకును వెలెతట్టున నున్నగూడెము. ఆవెలివాడలో గట్టకడపట మేదరవాడగలదు అక్కడ కటకుటీర విలాసినీవర్ణనము కొంత. అటపోవ నొక చండాలాంగన ఋతుస్నానార్ధమై వచ్చుట గానవచ్చెను. దీనిబట్టి వెలిపాళెము నగరముచుట్టును గలపరిఖకు వెలుపల దాని వంటి చుట్టియేని లేకపెద్దగపనిప్రాంతములం జుట్టియేనికలదనియు నందు దుట్టతుద మెదరవాడకలదనియు నొకప్రక్క చండాల వాటి గలదనియు చండాలస్త్రీ యగడ్తనీటిలో ఋతుస్నానముచేయ నెతెంచెననియు దెలియనగును. అట కొంతచనగా నొకకర్ణాటికుండతో నీళ్లగొంపోవుట గానవచ్చెను. ఆస్త్రీ నీళ్లనగడ్తనుండియే కొనిపోవుచుండవచ్చును. దీనిబట్టి యగడ్త జలసమృద్ద మనియు, నాజలము వెలిపాళెమువారి స్నానపానాదులకు దగియుండెననియు, దెలియనగును. ఆవలవారు హట్టమార్గమున జనిరి. హట్టమార్గ మనగా నంగడివీధి నగరములోనికి బోవుముఖ్యమార్గము. అందు 'మైలసంత ' గలదు. నగరము లోపాళేమున 'మడిసంత ' యు, వెలిపాళెమున 'మైలసంత ' యు నుండెడివిగాబోలును. మడిసంతలో నున్నతజాతులవారు గొనదగిన వస్తువులు (కూరగాయలు మొదలగునవి) యుండెడివి గాబోలును. మైలసంతలో నిమ్నజాతులవారికి గవలసిన వస్తువు మత్స్య