పుట:2015.333848.Kavi-Kokila.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

—-వ న కు మా రి

   అనిపల్కి, యంత వృద్ధుడు
    మనమున దలపోసి యిటుల మందాస్ఫుటలీ
   లను వచియుంచెను గనుల
   దొనికి శ్రుతి పుటముల నశ్రుతోయముజాఱన్.

  కడచెను బదునే డేడులు
  పడితిమి పడరానిపాట్లు వనసీమల, మా
  యిడుమలకు లెక్కగలదే
  కుడిచితిమి మునీశులట్లు కూరలు గాయల్.

నావిని వీరుడిట్లనె మనంబనుకవహింప, బూజ్యుడా
 యీవనభూమినేల లలితేక్షణతో సుకుమారబాలతో
 నే విభవంబుగోరక మునీశులలీల వసింతుచెప్పుమా
 నావుడు వృద్ధరాజనియె నంరముఖం నుగుడ్చిచూచుచున్

ధరనష్టాదశవత్సరంబునన్ శాత్ర వో
త్కరముంద్రుంచి ప్రజాప్రమోదకర సౌఖ్యస్ఫూర్తి బాలించితిన్;
నరనాధుల్ ననునిత్యముం గొలువ దిజ్నాగాస్య పత్రంబులం
ధరళామేయ యశోక్షరంబుల లసత్ఖడ్గంబునన్ వ్రాసితిన్.