పుట:2015.333848.Kavi-Kokila.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

  అంత వనకుమారి యనియెనిట్టుల నయ్యు
  యిదియెమాకుటీర మిందు జొరుము.
  దొడ్దివెట్టి గొఱ్ఱె తుటములనేవత్తు
  ననిన నట్లకాక యనియె నతడు.

   ఆలయంబు జొచ్చి యజినం బరుంగు పై
   బఱచి యుంటగాంచి బాగుపఱచి
   వృద్ధునల్లదింపి వేదిపై శయనింప
   బెట్టి, యంత నాట డిట్టులనియె.

గొఱియల దొడ్డిదోలి యిటకున్ సుమకోమల వచ్చునంతకుం
 ద్వరితగతిన్ రచింపవలెబంధము, నట్టులొనర్పకున్న న
 త్తరుణియు గ్రొత్తనెత్తురులు ధారలుగా స్రయింపగాంచియు
ద్దుర హృదయాకులత్వమున దు:ఖ పయోధిని మున్గిపోవదే.

అని యీరీతి వచించి నయ్యువకునయ్యా, యేమంధంబు, పో
 యెను గీలాలము రక్తనాళముల, నింకేలీల నా ప్రాణముల్
 మనునిమ్మేన, వృధాప్రయాసపడగన్ లాభంబె? నిస్సత్వభా
 జనమయ్యెన్ సకలాంగకంబులును; వాచాశక్తి జీర్ణీంచెడిన్.