పుట:2015.333848.Kavi-Kokila.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

హరిణదర్మమ్ము వఱచిన యరుంగుమీద
 గూరుచుండి యావృద్దుడు కొంతవఱకు
 నట్టెయుండి చివుక్కున ద్రారసీమ
 కరిగి యటుచూచి యొక కొంతయాలకించి

రేయిసగమయ్యె, దడవేమొ ప్రియకుమారి
రమ్మ, యనిపల్క బ్రత్యుత్తరమ్ము రామి
బవనకంపిత పర్ణనిస్వనమటంచు
నతడు చనులోనికెంతో హతాశుడగుచు.

మునుపటి యట్టులశోకము
తనువలచున్ వేరిమీద దడవుండి స్మృతిం
దనరెడువూర్వొన్నత్యము
మనమునదలపోసికొంచు మాటాడుకొనున్

న్రుగొనవచ్చునే సమయగర్బము సందెటువంటి చిత్రముల్
జననమునొందునో, యపరసంధ్య విలేఖని పశ్చిమాశనే
దినమున నెట్టి రూపముల దీర్చునో చెప్పగనౌనె సత్కవీ
శునికినిసైతముం; బ్రకృతిసూత్రసమన్యయ మూహకందునే