పుట:2015.333848.Kavi-Kokila.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి—-

అచ్చెలునయుం దటాలున
నచ్చట జ్నవమూర్తి గాంచి యాశ్చర్యమునన్
రిచ్చవడి యంత సాధ్వస
మెచ్చగ దేహంబు వణకనిలపై నొరహెన్.

ఒరగిన కాంతగాంచి యయయో! ననుగన్గొనియేమొభీతయై
 ధరసము గూలెనిత్తరుణి; దాపుననెయ్యెడనాసయోగ్యమౌ
 నిరవులు గానరావు; మఱియెచ్చటకేగునో, లేక కొండ ద్రి
 మ్మరులవలె వ్యసించునొ క్షమాధర ఘోరగుహాంతరంబులన్

లలిత నవీన యౌవనవిలాసము లొల్కెడి ముద్దరాలి గొ
ఱ్ఱెలను గజోరకంఠకవ్దరీముఖ భీకరశైలసానుభూ
ముల నిటుమేప బంచెనయె మూర్ఖుడెవండొ; సుమంబు
                                నెవ్వడేన్
దలనిడి శోకపాదములదాచునె రూపునశించిపోవగన్,

అనుచు దదీయశోచ్యదశ నాయువకుండొక ఱెప్పపాటు చిం
తనమొనరించి మంచుచలితాకున నింపఱు వారిజంబు రీ
తిని దలపించుచున్న జ్యుచతీమణి నల్లననెత్తి, జల్లు పె
ల్చన నమలంబుగందగు శిలాతలమందు పవిష్ట జేసియున్.