పుట:2015.333848.Kavi-Kokila.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

అనుగా దానుగూర్చుండి యతివశిరము
రొమ్మునకు మోపుకొని, మోము గ్రమ్మియున్న
యలక కింజల్కములనొత్తి యల్లనల్ల
నిమిరి, తలపోయుచుండె దుర్నియతిగతులు

   నిరపాయముకరుల నుపకృతి
   పరులై వర్తించువారి బావసమతులు
   బొరయును గష్టములిల ము
   ష్కరులను జేరంగబోవు సాహసులనియో!

జలజముత్యపున్ జిగిరసంబులువాఱెడి యూటనీటి కా
ల్వలు పలుమాఱు ఱాలవలవంతలగుందుచు శీకరాశ్రు సం
కలితములై మనొవ్యధలు గానము సేయంగ వార్షికాంబు క
శ్మలత వహించు వాహినులు సాగునుగాదె నిరర్గళంబుగన్

    యామినీకాంత శోక బాష్పాళియనగ
    బారిజాత ప్రమానముల్ ప్రత్యుషమున
    మందశశిరా నిలాహతి గ్రిందికురల
    నిలిచి యుండదె ఱెల్లుపూల్ నెలలకొలది.