పుట:2015.333848.Kavi-Kokila.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

   నను నన్వేషించువని
   జనుదెంచి తమోనిరుద్ధ చక్షుండయిబా
   టనుదప్పి జనకుడేగతి
   ఘన కాంతారముల జొచ్చిగాసిల్లెడినో.

తన యనుగాజనించి యిటు తండ్రిని గష్టము పాలు సేయునా
నిననమవంటి దంట లవనిం గలరేయెవరైన ; భిన్ననా
బనె జనయిత్రి వోయిన దిటంబగు కూర్మి కొఱంత లేక సా
కెను బడరాని పాటులకు గేవలమున్ గుఱియయ్యు
                                           నయ్యయో

 మంజులారామ వీధులు మనము నెంతో
 సంతసంబున దేలింప జాలియును ని
 రంత శోకార్తు డౌతండ్రి స్వాంత మందు
 నిస్తు లానంద శాంతుల నింపలేవు

జ్ఞాన సమాశ్రయంబగు విశాలలలాటము శోకలాంచనా
నూనవళి ప్రభంగముల నిప్పఱియెం; బొరలెక్కి కన్నలీ
క్షానిశితత్వముందొఱగె; జలసంభావము నొందెనాత్మ;తం
డ్రీ, వెలవయ్యెనీ తనువు టెక్కుదొలంగిన యంగపాలికిన్