పుట:2015.333848.Kavi-Kokila.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

   కన్నులకున్ విద్యుల్లత
   క్రన్ననమిఱుమిట్లు గొల్ప గంపితయయి మీ
   కన్నియ్లదిగ్బ్రాంతిని దా
   నున్న విధంబేమియనుచు నుమ్మలికమునన్.

అటు నిటు పాఱజూచి జలదావృత యామినిగా నెఱింగి య
క్కట, తిమిరంబునల్గడల గాఱుకొనెం, గనంగానరాదు, మి
క్కటముగ వానపట్టె; మెయికంపిలె జల్లని కొండగాలికిం
బటములనీరు జొబ్బిలె, నుపాయము సాయముగాన నిత్తఱిన్.

   ఎంత నిశియయ్యెనయ్యయో, చింత జిక్కి
   యెఱుగ సంధ్యయడంగుట, నురులుగ్రమ్ము;
   టెబులబోగల నొంటిగనీభయాక
   రమ్ములగు కొండలోయల బ్రాంతరముల.

నను జించించుచు దండ్రి యేమనునొ, యేనాడైననే
                                             నొంటిగా
నన మధ్యంబుననుంటి నేనిశల, నీనాడేమొ దుర్భుద్దిరే
చినయట్లాయె,మృగంబు లేవయిననంజెండాడెనో యంచుబా
యని శోకమ్మును గుందునో, కనలునో యత్యంత
                                            మీచేతనన్