పుట:2015.333848.Kavi-Kokila.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

   కన్నులపన్ విద్యుల్లత
   క్రన్ననమిఱమిట్లు గొల్పగంపితయయి యా
   కన్నియదిగ్ర్భాంతిని దా
   నున్న విధంబేమియనుచు నుమ్మలికమునన్

అటు నిటు పాఱజూచి జలదావృత యామినిగా నెఱింగి య
క్కట, తిమిరంబునల్గడల గాఱుకొనెం, గనుగానరాదు మి
క్కటముగ వానపెట్టె; మెయికంపిలె జల్లని కొండగాలికిం
బటములనీరు జొబ్బిలె, నుపాయము సాయముగాన నిత్తఱిన్.

  ఎంతనిసియయ్యెనయ్యయో, చింత జిక్కీ
  యెఱుంగ సంధ్యయడంగుట, నిరులుగ్రమ్ము,
  టెటులబోగల నొంటిగనీభయాక
  రమ్ములగు కొండలోయల బ్రాంతరముల.

నను జింతించుచు దండ్రి యేమనునొ, యేనాడైననే
                                             నొంటిగా
నన మధ్యంబుననుంటి నేనిశల, నీనాడేమొ దుర్బుద్దిరే
చినయట్లాయె;మృగంబు లేవయిననంజండాడెనో యంచు బా
యని శోకమ్మున గుందునో, కనలునో యత్యంత
                                          మీచేతకున్