పుట:2015.333848.Kavi-Kokila.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

ఎన్నడెఱుగని మీయల్లుడేమొకాని
నిన్నప్రొద్దునవచ్చి మాజొన్నమడికి
బెద్దకంకులు బుట్టెడు విఱిచెనంట!
కంచెయే చేనుమేసిన గలదెదిక్కు?

పిల్లలు పెండ్లము నేనును
నిల్లనకయు వాకిలనక యేగి మడులలో
బెల్లుగ గష్టముచేసియు
జెల్లించగలేము శిస్తు జేజే, సామీ,

మీరే తల్లుతండ్రులు
మీరే బందుగులు మాకు, మీనలవన మా
వారలు పిల్లాపిసుగులు
గారాబముతోడ బ్రతుక గలిగితిమయ్యా.

మీరు పెంచిన మొలకను మీరె గోట
ప్రక్కలించిన మీకేదిదిక్కు తండ్రి?
కడుపులోపలికి యంబలి గదలకుండ
సాకుచుండిరి మీతాత సాలినుండి.