పుట:2015.333848.Kavi-Kokila.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

పడకలనుండిలేచి చలివాయగ జీరలుగప్పి,చేతులం
దిడికొని పేడచేటలను, 'హే ' యని బఱ్ఱెమదల్చి నాదియూ
కడియని యెత్తబర్విడుచు గావులపిల్లలు బఱ్ఱెతండముల్
వడిజను వీధులందు నటుచచ్చుచు బోవుచునుండిర త్తఱిన్.

    దుర్భరంబగు గర్భంబులోన నపుడు
    కదలజాలక కదలుచు గాపువెలది
    ప్రాచిపనులెల్ల దీరిచి బఱ్ఱెదూడ
    వదలి పాల్వించె గంకణక్వణన మొలయ.

   అంత వెడవెడ నొప్పులు గానిపించుటయు, గర్బవేదన కాదలచి,నలజారమ్మ తన తల్లినిం బిలుచనంప నామెయు మంత్రసానింంబిలిచికొని కూతురుం జూడవచ్చె. ఇట్లుండ మాదిగ యొకండు, తనజొన్నచేనిలో గంకులు విఱిచియుండుట గన్గొని చేనిప్రక్కన యాలమేపు మాలపిల్లలవిచారించి, వెంకటరెడ్డి గోసెనని తెలిసికొని, యాజారదారుడును నలజారమ్మ తండ్రియునగు పెంచలరెడ్డి జేరి యిట్లని విన్నవించుకొనియె