పుట:2015.333848.Kavi-Kokila.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

హంసబాలిక లంబు విహారలీల
నంబరాపగ తరగల నాటలాడ,
గంపెతింబయి యంభోజకాండరజము
లలమికొనెనన వెన్నెల లలరెమింట.

అంత నాకాంత భర్తకు నన్నమునిడి
చంద్రికామోహనంబైన శర్వరి నటు
పవ్వళింపగ మంచము బయటవైచె
నడుగువెట్టుట యామడ యట్లుగాగ.

పతియు భుజించివచ్చి 'సతి, పందులుదున్నలు గోవయావులున్ '
సతతము జొన్నచేలంబడి సర్వమునాశముచేసెనంట; యా
వితమును నేటిరాత్రిగని వేకువవత్తు ' నటన్న భర్త, యా
సతి ఇటుపల్క 'నాధ, మదిసంధిఉలెగోర్కెయొకండు దెల్పెదన్.

ఊచబియ్యముమీద నాకూహ వొడమె,
దిరిగివచ్చెడునప్పుడు తెమ్మ జొన్న '
కంకులొకపది ' యనిచెప్ప గలికి, హలికు
డట్లనే యని తలయూపి యరిగెనపుడు.