పుట:2015.333848.Kavi-Kokila.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

పొలతి యొకింతసేపు కనుమోడిచి, స్వప్నమురాగలేచి యీ
కల ఫలమేమొ? మట్టియులు ఘల్లని వీడెను. క్రొత్తచీర నా
తలపయి గప్పినట్లుపడె, దారుణ వహ్నిశిఖా ముఖంబునం
బలువురు దండసంభృతుల లల్మి ననుంబడద్రోచి రుగ్రులై

సారసగంధి యిప్పగిది స్వప్నచిధంబును జింతచేసి 'యో
నారనసంభవాది సురసత్తమవందిత పాదపద్మ, ని
ష్పారకృపాపరా, పతికి బాధయొకింతయు నెప్పుడేనియున్
గూరకయుండుగసత!' మని కూర్మిదలంచె రమామనోహరున్

నూటికి స్వప్నసంగతులు మానసవీధిగలంచ గావు నీ
మాటి భయార్తచిత్తయయి మంచము గేహమునందు వైచి, దీ
గూటను దీపమున్నిలిపి కూర్కెనొకించుక, యంత శ్రావ్యమై
వాటిలె గిల్కిలారవము పక్షికులాయములందు బెల్లుగన్

    కొక్కొరోయని కూసె గుక్కుట నికరంబు
      ఱెక్కలు దట్టించి నిక్కినిక్కి
   చెరువునీటికిబోవు చేదెల యందెల
      ఘల్లల్లురావము గదలుకొనియె.