పుట:2015.333848.Kavi-Kokila.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

ఆలమందలగదిలించి, హాళికులకు
కనులు చాలింప గనుసన్నబరగదెలిసి
భర్తలనుగూడ నుత్కంఠ భామినులకు
గొలిసి, రజనీముఖంబున గొఱలె నినుడు.

సాంధ్యరాగంబు వృక్షాగ్రశాఖలందు
నలమికొనినంత వహ్నీకీలలుగనెంచి
పక్షులెల్లను గూయుచు బఱచుచుండె
గాలిపోయెను గూళ్ళంచు గడురయమున.

తార లుల్లసిల్లె; జారుల మనములు
కలువలట్ల కాంతి గడలుకొనియె
జక్రవాకకాంత స్వాంతంబుపోలిక
దమ్మి మోముమోడ్ఫె నుమ్మలించి.

అభ్రకేదారమున జంద్రుడనెడు గోప
బాలకుం డుడుగణమను పసినిమేపు
చుండు సోయగ మత్తరినొప్పె; నటుల
గాక, చిహ్నమన్ గొంగడి గలుగుటెట్లు?