పుట:2015.333848.Kavi-Kokila.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

నిశ్చలజ్యోతియై నిర్మలంబైన చి
   త్తము నిశాగర్భ శాంతత్వమందు;
మై మఱచి నటించు మంజుల క్రీడలు
  సరసీ తరంగ లాస్యముల యందు;
  
ఐఖ్యమైపోయి వ్యక్తిత్వ మంతరించి
యఖిలవస్తు చయాంతస్ద నైతినన్న
వింతభావమ్ము లోలోన విస్తరింప
నిర్భరానందమునునుంటి నిశనుక్షణము.

నీవిఛ్ఛో నివసింప నిష్టవసినన్ నిత్యమ్ము దత్ప్రాంత సే
 వావిద్యోతిత మానసాంబుజులమై వ్రాభాత నీ రేజ మం
 డా విర్భూత సుగంధగందిల తుషారార్ద్రా నిలాంకుల్ రము
 వీవంగన్ విహరించుచుందెదము సంప్రీతిన్ వనీ వీధులన్;
 
 జనకుని యట్టులంత్యమున సర్వమువీడి ధరాతలంబునన్
  మనవగు పేరులెవ్వరు మనంబున నెంచని రీతిగాల నీ
   ధిని మన యంఘ్రీ చిహ్నములు తేరనియట్టుల మృత్యు
                                                       సూత్రలం
  బనమున బ్రాకిపోయెదము స్వర్గముసేరగనోయి మిత్రమా