పుట:2015.333848.Kavi-Kokila.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

పొలమునకేగియున్న పతి బోజనవేళకు రాకయున్ననా
వెలదియు రాట్నమున్ రవలివెట్టగ ద్రిప్పుచుజూరునందు గి
ల్కిలమనిపల్కు పిచ్చుకల క్రీడలుసూచుచునుండ నంతలో
వెలుపలనుండి పిల్లలకు వేగమమేతలు దెచ్చె తల్లియున్.

తల్లినిజూచి పిల్లల ముదంబున గంధరముల్ నిగుడ్చి సొం
పుల్లసిలంగ జంచువుల నొండొరు మీఱగజూపి యేపురం
గిల్లని తల్లియున్నదెసగ్రక్కిఱియం, గలవింక మంత న
ల్లల్లనమేతవెట్ట నది యంతయుగాంచుచునుండె గాంతయున్

ఔరా! సృష్టివిచిత్రమెన్నదరమా? యంభోజగర్భుండు సొం
వారం బిట్టకునైన నెట్టి వలపత్యంతంబు గల్పించి సం
సారాంభోధితరంగ డోలికల సూచంగల్గె నీ లోకమున్
ఈరీతిన్ విధిసేయకున్ననగునే యెందైన సంసారముల్.

ఱెక్కలు వచ్చినంతనె తఱగని పాడఱ వీడి నీడ మే
దిక్కున నేకుజంబులనొ తేకున గూండ్లు రచించి తల్లియున్
మక్కువలేకయుండు కసుమాలపు బిల్లలమీద బక్షికీ
మక్కువయున్నదే! యికను మానవులన్వవలపుంట దొడ్డయే!