పుట:2015.333848.Kavi-Kokila.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

పిట్టలకైనగాని యిటు పిల్లలజూచినయంత మల్లమం
దెట్టులనుండునో మమతయెవ్వరికైనను జెప్పశక్యమే!
కట్టిగాడె బ్రహ్మయటు కౌతుకయుక్తలజేసి పక్షులన్
దిట్టతినాన నన్ను గడుదీనత మ్రక్కగజేసె నక్కటా!

ముంజు బుడబుక్కివానికిని మోదమునన్ జరిచీరయీయ నా
కనువుగవెండితాయెతున యంత్రముసంఘటియించి యిచ్చెనా
యనఘుడ; దేమొకాని యటిలైనను నొక్కయపత్య మింతకు
బనవుటెకాని కల్గదుగ! ప్రాగ్భవ ద్రుష్కృత మెంతగాఢమో!

నాసరివారిజాక్షులు మనంబున బ్రేమతురంగలింప నా
శాసురు సన్నిభాత్మజుల జిక్కిగిలిగింతలువెట్టి పాదవి
విన్యాసచిలాసముం గనుచు నాసనచుంబన మాచరించుచున్
వాసముల్ తమింగడుప నీకీటు వంజతనంబు చెల్లునే?

పూర్వంబెట్టియఘంబు సల్పితినొ? యేపుణ్యాత్ములన్ సాధులన్
గర్వాంధంబున గష్టనెట్టితినొ? యేకల్యాణి సత్పుత్రు నే
సర్వాంగంబు గఠోరశస్త్రికలచే స్రగ్గించినానో? ననుం
బర్వెం దద్వృజినావళుల్ కటకటా! వంధ్యాత్వ రూపంబునన్