పుట:2015.333848.Kavi-Kokila.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

గిరికూటంబుల సాంధ్యరాగగసముల్; క్రేవన్ డిగంబాఱు ని
 ర్ఘర పూరంబుల లీనమౌనపుడు నారాకంబ్రతీక్షించుచున్
 సరణిన్ వేచుచునుండుదండ్రీ; యికనన్ సంతోషమేపారనె
 వ్వరు వీక్షించెడువారులేరొ?పితతో బాడాయనేయంతయున్

నీరు వట్టిపోయిన సేలయేటి రీతి
 నురులబడిన పక్షులగూళ్ళ తెఱగు, నాదు
 జీచితము శూన్యమయ్యె; ఆశింపులేదు
 పుప్పొడుల యొత్తు పఱపుల పూలబాట!

అనవిని వీరుడంత జెలియంగని యిట్లను; గాంతయేల నె
 మ్మనమున జింతవోవ, వినుమా వచియించెదనొక్కమాటునీ
 జనకునికన్న మిన్నయగు చాడ్పున నం దలపోయకున్న, నీ
 కనయము మేలుసేయునొకయర్మిలి నెయ్యునిగాగణింపుమీ.

ఆలవాలంబునంబుట్టి యందె పెరిగి
 పూవురెమ్మల బొదలెడు పుష్పవల్లి
 ప్రక్కవిలసిల్లు తరువునంబ్ర్రాక కున్నె;
 లతలు కాంతలు నాశ్రయోల్లసితలెపుడు.