పుట:2015.333848.Kavi-Kokila.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ న కు మా రి

6

కిలకిల పులుగులు తరు శా
 లేఖల రుతము లొనర్చె; వంచకంబులు కూత
 గొలుపుటమాని గుహాంతర
 ముల దాగెను; దూర్పుదిక్కు పొదలెం గాంతిన్.

ఆయువను వైరి హరియింప ననుదినంబు
 నుదయ గిర్యగ్ని నాళికనుండి తప్త
 గోళమున్ ప్రేల్చుచున్నాడొ కాలుడనంగ
 నలరె దరుణార్క బింజ మత్యరుణ కాంతి.

ప్రాజ్నగంబను నగ్ని పర్వతముప్రిదుల
 దరణి రుచియను మృత్తికా ద్రవమురేగ
 బరిసర నివాసులోయన బక్షికులము
 గూయుచును నాల్గుదిక్కుల గూడబాఱె.