పుట:2015.333848.Kavi-Kokila.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

జనకు డొనర్చిన దుష్కృతి
 కిని బ్రాయశ్చిత్త మనగగే తన పురికం
 గొనిపోయి యీనేలంతను
 తన పితరాజ్యంబు తనకె దానము సేతున్.

శుక్తి గర్భంబునన్ దాగి శోభగనని
 యాణి ముత్తెంబుపగిది నీ యతివమిన్న
 కఠినకంటక భూయిష్ఠ కాననముల
 నెటుల జీవితముంబుచ్చె నింతదనుక.

ఇన్నిపాట్లకు మాతండ్రి హేతువన్న
 నిజమెఱిగిన ద్వేషంబు నెగడకున్నె?
 గతమ్నకు గుంద ఫలమేమి గలుగు నిపుడు;
 అప్రియంబైన సత్యంబు హానికరము.

అనియిటు చిత్తాందోళన
 మున యువకుడుత్రుటియుంగనులు మూయకరేయె
 ల్లనుబుచ్చె; నాకుమారియు
 దనిసెను సుఖనిద్ర కలత దాకకయుంటన్.