పుట:2015.333848.Kavi-Kokila.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

కాలమునదక్క మఱియేమి కార్యమందు
 మరణమునకును నీకు నంతరము గలదు?
 స్వర్గ సౌఖ్యమ్ము నిరయసంసర్గ బాధ
 స్వప్నమా, నీదుగర్భాన సంభవించు.

ప్రణయ శేషుల మృత మిత్రబాందవులను
 గౌగిలింపంగ గల్గు నీకరుణ కలిమి;
 స్వర్గమర్త్య లోకముల సంసర్గసూత్ర
 మీవు స్వప్నమా, యేమని యెనుతించు.

ప్రొద్దు వొడుపున వికసింప బొవుతమ్మి
 పూవురీతిగ నిదురించు బూవుబొణి;
 ఱేకస లెడలినకంజ కర్ణిక విధాన

జనకుండేగె నిసర్గసిద్ధ సరణిన్ స్వర్గంబు కాంతాయటం
 చును నేనెట్లువచింతు; నాత్మగొఱకచ్చుల్ సోకినట్లౌగదా!
 జనకుండే జనయిత్రి యట్టులందమిన్ సాకంగ గాంతరమే
 తన లోకంబుగనున్న ముద్దియమనస్తాపంబు నెట్లూడ్చెదన్.