పుట:2015.333848.Kavi-Kokila.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

నెరయు దచానల కీలలు
 తిరుకొటర నికటమునకు దార్కొనుచుండన్
 మఱచి సుఖనిద్ర జెందెను.
 కరుణాస్పదయైన శారికను దలపించున్.

మరలసౌఖ్యమ్ము రుచిచూప మానవులకు
 స్వప్నమా, నిన్నుసృజియించె వనజభవుండు,
 కాకయున్న దృషా విలలోకమునకు
 నొక్కతృటియైన విశ్రాంతి దక్కగలదె.

శోకసంతాపమున నాత్మ సొమ్మసిల్లు
 కష్టజీవికి నిశ్చింత గలుగ చేయ
 స్వర్గ నిశ్వాసమోహన పవనమటుల
 నిద్దురా, వీచుచుందువు నికట యందు.

నీదు సంస్పర్శనంబున నిఖిలజగతి
 యేక జీవసమాధిగ నెసగుచుండు;
 గగనమందుల్లసిల్ల నక్షత్రగణము
 పైని వెదచల్లు పువ్వుల పగిదిదోచు