పుట:2015.329863.Vallabaipatel.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

వల్లభాయిపటేల్

జయముగాంచిన విజయసారధి. భారత స్వాతంత్ర్యసమరములో నపూర్వసాహసమునఁ బోరాడినసేనాని. సద్యస్స్ఫురణ, సూక్ష్మ దృష్టి, శీఘ్రనిర్ణయము, భావగాంభీర్యము, వజ్రసంకల్పము, నిర్మాణ నైపుణ్యము, కార్యదీక్ష, ఆత్మవిశ్వాసము, సహజ వివేకము, సర్దారు ప్రత్యేక గుణములు.

ఆయన నిష్కపటి; కాంగ్రెసు నాయకులందఱలోను మంచి నిష్కర్షకలవాఁడని ప్రఖ్యాతిగాంచినవాఁడు. తన కనుకూలురు కానివారందరును బ్రతికూలురనియే భావించును. తటస్థభావ మనునది లేనేలేదు. ఆయన తలపెట్టిన పని యేదైనను సాధించక విడచిపెట్టఁడు. నిందాస్తుతులను లక్ష్యపెట్టఁడు. కర్తవ్యనిర్వహణలోఁ జండశాసనుఁడు. బారిష్టరైయుండికూడఁ దాను గర్షకుఁడనని చెప్పికొను వినమ్రమూర్తి.

ఇంపీరియలిజము, ఫాసిజములవలె సోషలిజము, కమ్యూనిజములుకూడ నాయనకు సరిపడని సంగతులు. గాంధీయిజమే యాయనకు గణనీయమైనది.

[1] “తన హక్కులపై దాడిజరిగిన నెంత పట్టుదలతో వ్యవహరించునో చెప్పుటకు వీలులేదు.

“స్వార్థరహితుఁడు. పనికిమాలినవారిని, నంతకంటె నెక్కువగా దుష్టులను, నియంతలను నిరసించువాఁడు.

“పోరాటము - ఇదియే యాయన నినాదము.

“సత్యాగ్రహిగాఁ బోరాడును. ఎవరిపై సహాయనిరాకరణము సాగించునో, యతనితో సహకారమునకై యెప్పుడును సిద్ధముగనే యుండును, యథార్థమైన సత్యాగ్రహి.

  1. 1945 నవంబరు 3 వ తేది 'ఆంధ్రప్రభలో, పట్టాభిగారి వ్యాసమునుండి.