పుట:2015.329863.Vallabaipatel.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయము

సర్దారు పటేలు కాంగ్రెసు నాయకులలో భీష్మాచార్యుఁడు. భీష్మాచార్యుడేకాదు, భీష్మప్రతిజ్ఞకలవాఁడు. గాంధీజీ తరువాత భారత రాజకీయాలలో గణనీయుడు అయినను జవహరునకు ప్రేమాస్పదుడగువాడు. రాజాజీ వంటి మేధాసంపన్నుడాయన. కాని భారతనాయకులలోఁ బ్రత్యేకతఁగన్నవ్యక్తి. గాంధీయుగములో నొక విశిష్టతఁగల నాయకుఁడు. సముద్రునివలె గంభీరుఁడు. మేరువువలె నచంచలుఁడు. హిమగిరినిబోలు నున్నతుఁడు. సాటిలేని మేటి పరాక్రమము, దేశమునెడలఁ పవిత్రప్రేమ యాయనకు సహజాలంకారములు.

ఆయన హృదయము గుహవలె విశాలము, భయంకరము. “వజ్రాదపికఠినము, కుసుమాదపి కోమలము” కూడ.

గాంధీజీ కుడిభుజమని పేరుగాంచిన పటేలు చేతులలోఁ బడి తప్పించుకొని పోయిన వారెవ్వరును లేరు. భ్రిటిషుసింహమే గజగజలాడినది.

ఆయన గాంధికీ ముఖ్యశిష్యుఁడే, అయినను నాయన ప్రచారకుఁడు, ప్రబోధకుఁడుకాఁడు. ఆయనపద్ధతి భిన్నము. గాంధీజీ సిద్ధాంతములరీత్యా పోరాటములు జరిపించి ప్రపంచ విభ్రమ కలిగించిన కార్యసాధకుఁడు.

సర్దారు తన జీవితమంతయు రాజకీయములకే యర్పించెను. బ్రిటిషు ప్రభుత్వమునుండి యధికారమును హస్తగతము చేసికొనుటకు సత్యాగ్రహసమరము జరిపి ప్రతిరంగమునందు